తెలుగు సినిమా కీర్తి కెరటాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’ చిత్రం విడుదలయ్యి నేటికి 45 సంవత్సరాలు పూర్తయ్యింది. ఫిబ్రవరి 2, 1980వ సంవత్సరంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విడుదలయ్యింది. కళా తపస్వి శ్రీ కే.విశ్వనాధ్ దర్శకత్వంలో, పూర్ణోదయా ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై శ్రీ ఏడిద నాగేశ్వరరావు – ఆకాశం శ్రీరాములు నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రం ఇక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా, పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక మరియు కేరళల్లో కూడా అఖండ విజయం సాధించి, అప్పట్లోనే పాన్ ఇండియా మూవీగా నిలిచి చరిత్ర సృష్టించింది. మరోవైపు అమెరికాలో కూడా రెగ్యులర్ థియేటర్స్‌లో విడుదలైన మొట్ట మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.
అలాగే ప్రపంచ నలు మూలల్లో ఎన్నో దేశాల్లో విడుదలయ్యి, తెలుగు సినిమా సత్తా ఏంటో చూపించింది ఈ చిత్రం. ఆ రోజుల్లో ఎవరి నోట విన్నా శంకరాభరణం గురించే ప్రస్తావన. శాస్త్రీయ సంగీతానికి ఆదరణ కరువైన రోజుల్లో, ఈ చిత్రం విడుదల తరువాత ఎంతో మంది శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం మొదలుపెట్టారు. ప్రతి తెలుగు వాడు మా సినిమా అని గర్వంగా చెప్పుకొనేవారు.
ఇక అవార్డుల విషయానికి వస్తే, జాతీయ అవార్డుల్లో కళాత్మక విలువలు, వినోదాత్మకంతో కూడిన జనరంజక చిత్రంగా ‘స్వర్ణ కమలం’ అందుకుంది. తెలుగులో స్వర్ణ కమలం అందుకున్న తొలి తెలుగు చిత్రం కూడా ఇదే. అలాగే గాయకులు శ్రీ ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంకు ఉత్తమ నేపధ్య గాయకునిగా తొలి సారి జాతీయ అవార్డు, శ్రీమతి వాణి జయరాంకు ఉత్తమ గాయకురాలుగా, శ్రీ కే.వి. మహదేవన్ ఉత్తమ సంగీత దర్శకునిగా జాతీయ అవార్డులు అందుకున్నారు.
Besancon ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ (ఫ్రాన్స్)లో ఉత్తమ చిత్రంగా అంతర్జాతీయ అవార్డు అందుకున్నది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మక నంది అవార్డులను ఏకంగా 8 గెలుచుకుంది. ఇక దేశంలోని అనేక సాంస్కృతిక సంస్థలు ఈ చిత్ర బృందాన్ని అవార్డులు, సన్మానాలతో ముంచెత్తాయి. ప్రముఖ ప్రవచనకర్త శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శంకరాభరణం చిత్రంపై మూడు రోజులు ప్రవచన కార్యక్రమం చేయడం విశేషం. అలా ఓ చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి.
అలాగే ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చిందీ చిత్రం. ముఖ్యంగా కథానాయకుడిగా నటించిన జె.వి. సోమయాజులు గారిని సినిమా విడుదల తర్వాత అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు. అప్పట్లో వాంప్ పాత్రలు ఎక్కువగా చేసే మంజు భార్గవి ఇందులో చాలా పవిత్రమైన తులసి పాత్రలో లీనమైపోయింది. నాటి చిత్ర పరిశ్రమలోని దిగ్గజ హాస్య నటుల్లో అగ్రగణ్యులైన శ్రీ అల్లు రామలింగయ్య ఓ కీలక పాత్ర పోషించారు.
ఇక ఈ చిత్ర పాటలు ఇప్పటికీ భాషతో సంబంధం లేకుండా అందరూ పాడుతూనే ఉంటారు. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై మరియు హైదరాబాద్‌లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలు గడిచినా, ఇంకా ఈ చిత్రం ఏదో మాధ్యమంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుండటం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























