యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఈ మూవీ హిందీ ట్రైలర్‌ను ముంబైలో లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తండేల్ సినిమాతో పాటే అమీర్ ఖాన్ గారి అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. అయితే నేను ఇక్కడ సినిమా చేసిన సూపర్ స్టార్ ఒక్కరే. ఆయనకి ఫోన్ చేసి ట్రైలర్ లాంచ్ గురించి చెప్పాను. ‘ఏం పర్లేదు.. రెండు సినిమాలు అద్భుతంగా ఆడుతాయి. నేను వస్తున్నాను అన్నారు. ఆయన కైండ్ హార్ట్‌కి థాంక్ యూ.” అని న్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తండేల్ నిజంగా జరిగిన కథ. వైజాగ్ తీర ప్రాంతంలోని కొందరు వ్యక్తులు చేపల వేటకు గుజరాత్ వెళ్లి పొరపాటున బోర్డర్ క్రాస్ చేసి పాక్ సైన్యం చేతిలో చిక్కుకొని జైలు పాలైనవారి కథ. నిజ జీవితంలోని వ్యక్తులని కలసి వారితో మాట్లాడటం జరిగింది. దర్శకుడు చందు ఈ కథని అద్భుతంగా తీర్చిదిద్దాడు” అని తెలిపారు.
అలాగే హీరో, హీరోయిన్ గురించి చెబుతూ.. “జైలు సీన్స్, విలేజ్ సీన్స్, లవ్ స్టొరీ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటాయి. సాయి పల్లవి చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసింది. నాగ చైతన్య తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆయన కెరీర్ తండేల్ తర్వాత తండేల్‌కి ముందు అన్నట్టుగా వుంటుంది. ఈ సినిమా కోసం ఏడాదిన్నర పాటుగా నిరంతరం కష్టపడ్డారు. దేవిశ్రీ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. టీం అందరికీ పేరుపేరునా థాంక్ యూ” అని చెప్పారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: