డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలిసిన దిల్ రాజు

Producer Dil Raju Meets AP Deputy CM Pawan Kalyan

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, టీఎఫ్‌డీసీ ఛైర్మన్ దిల్ రాజు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, స్టార్ హీరో పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఈ మేరకు సోమవారం ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. కాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించగా, దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం త్వరలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలలో భాగంగా ఆంధ్రాలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించడానికి నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్ ను ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో విడుదల చేయగా.. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ను అమెరికాలో గ్రాండ్‌గా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆంధ్రాలో ఏర్పాటుచేస్తున్న ఈ వేడుకకు ఆహ్వానించడం కోసం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ అయ్యారు.

“పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా ఈవెంట్ చేయాలని అనుకుంటున్నాం. ఆ విషయం గురించి మాట్లాడేందుకు విజయవాడకు వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ను బట్టి ఈవెంట్ ఎప్పుడు? ఎక్కడ? అనేది ఫిక్స్ అవుతాం. ఈ ఈవెంట్ మాత్రం మామూలుగా ఉండకూడదు. చరిత్ర క్రియేట్ చేసేలా ఉండాలి.” అని నిన్న ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో 256 అడుగుల రామ్ చరణ్ భారీ కటౌట్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో పేర్కొన్నారు.

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన గేమ్ చేంజర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.