సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ లో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీ తేజ్ ను టి ఎఫ్ డి సి చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు కొద్ది సేపటి క్రితం పరామర్శించారు.ఈ సందర్భంగా శ్రీ తేజ్ తండ్రి భాస్కర్ ను కలిసి ధైర్యం చెప్పారు.అనంతరం దిల్ రాజు మీడియా తో మాట్లాడారు.ఇప్పుడు కావాల్సింది భాస్కర్ కుటుంబానికి అండగా ఉండడం.హీరో అల్లు అర్జున్ సైడ్ నుండి వారు అన్ని విధాలుగా ఆదుకుంటారు.అలాగే మేము కూడా అన్ని రకాలుగా తోడుగా ఉంటాం.ఇదే విషయాన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పమ్మన్నారు.శ్రీతేజ్ ఫ్యామిలీ ని ఆదుకునే బాధ్యత మాది.అవసరమైతే సినిమా ఇండస్ట్రీ లో భాస్కర్ కు పర్మినెంట్ గా జాబ్ ను కూడా ఇస్తామని దిల్ రాజు అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అలాగే నిన్న పుష్ప 2 చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ రూ.50లక్షల చెక్కును మృతురాలి కుటుంబానికి అందించిన సంగతి తెలిసిందే.తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆస్పత్రికి వచ్చిన ప్రొడ్యూసర్స్ చికిత్స పొందుతున్న రేవతి తనయుడు శ్రీ తేజ్‌ను పరామర్శించారు.ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.
ఇక సంధ్య థియేటర్ ఘటన లో భాగంగా ఈరోజు అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు విచారణకు హాజరయ్యారు.సుమారు 2 గంటలకు పైగా పోలీసులు ఆయనను విచారించారు.అనంతరం అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్లిపోయారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























