పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి చిత్ర నిర్మాతలు భారీ ఆర్ధిక సాయం అందించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ అధినేతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సోమవారం రూ.50లక్షల చెక్కును మృతురాలి కుటుంబానికి అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆస్పత్రికి వచ్చిన ప్రొడ్యూసర్స్ ఆ సంఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న రేవతి తనయుడు శ్రీ తేజ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులు మరియు మృతురాలి భర్త భాస్కర్‌తో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. అనంతరం వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే ఈ తొక్కిసలాట వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ హీరో అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపడం దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయింది. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఒకరోజు తర్వాత ఆయన విడుదలవడం అందరికీ గుర్తుండేవుంటుంది.
ఇక తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై అసెంబ్లీలో సుదీర్ఘ ప్రసంగం చేయడం, ఆ తర్వాత హీరో అల్లు అర్జున్ జరిగిన ఘటనలో తన ప్రమేయం లేదంటూ ప్రెస్ మీట్ పెట్టడం.. అనంతరం ఆయనకు కౌంటర్‌గా తెలంగాణ పోలీసులు వీడియో రిలీజ్ చేయడం.. ఇలా వరుసగా జరిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే నిర్మాతలు బాలుడిని పరామర్శించి, బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఆర్ధిక సాయం అందించడం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























