పుష్ప 2 హిందీ 18 డేస్ కలెక్షన్స్

pushpa 2 hindi 18 days collections

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 మూడో వారంలో కూడా ఏమాత్రం స్లో అవ్వకుండా సెన్సేషనల్ వసూళ్లను రాబడుతూ అదరగొడుతుంది.నిన్న ఈసినిమా 27కోట్ల వసూళ్లను రాబట్టడంతో మొత్తం 18రోజుల్లో దేశ వ్యాప్తంగా హిందీ వెర్షన్ 692 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. ఈరోజుతో 700కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది. ఇప్పటివరకు ఏ సినిమా కూడా ఈ మార్క్ ను టచ్ చేయలేదు.దాంతో హిందీలో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో మరో 100కోట్ల వరకు రాబట్టే ఛాన్స్ వుంది.ఓవరాల్ గా చూసుకుంటే దేశ వ్యాప్తంగా అన్ని వెర్షన్లు కలిపి 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టుకుంది.ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పుష్ప 2 హావ కొనసాగిస్తోంది.నిన్న రెండు రాష్ట్రాల్లో కలిపి 3కోట్లకుపైగా షేర్ ను కలెక్ట్ చేసింది.దాంతో 18రోజుల్లో ఈసినిమా 200కోట్ల షేర్ ను మార్క్ దాటేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సంక్రాంతి వరకు సినిమాలు లేకపోవడం 56 రోజుల తరువాతే ఓటిటి లోకి వచ్చే ఛాన్స్ ఉండడంతో లాంగ్ రన్ లో పుష్ప 2 భారీ లాభాలను తీసుకురానుంది. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే నిన్నటి వరకు పుష్ప 2, 1600కోట్ల కుపైగా వసూళ్లను రాబట్టింది. బుక్ మై షో లో ఇప్పటివరకు వరకు 17. 5మిలియన్లకు పైగా టికెట్స్ సేల్ అయ్యాయి.

సుకుమార్ ఈసినిమాను తెరకెక్కించగా రష్మిక మందన్న కథానాయికగా నటించింది.రావు రమేష్, జగపతి బాబు ,జగదీష్ కీలక పాత్రల్లో కనిపించారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మించింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.