హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ సహా ఇతర ప్రచార చిత్రాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి ‘మా ఊరి జాతరలో’, ‘అదే నేను.. అసలు లేను’, ‘మరీ అంత కోపం’ అనే పాటలను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుని మార్కెట్‌లో మూవీపై మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేశారు మేకర్స్. దీనిలో భాగంగా నేడు ‘బచ్చల మల్లి తిరునాళ్లు’ పేరుతో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. యంగ్హీ రో కిరణ్ అబ్బవరం, స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుక గ్రాండ్‌గా జరిగింది. ఇక రీసెంట్‌గా స్టార్ హీరో నాని ఈ సినిమా ట్రైలర్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే.
ఇక ఇదిలావుంటే, ఇప్పుడు ఈ మూవీ నుండి మరో కీలక అప్డేట్ అందింది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను ముగించుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. కాగా ఈ చిత్రంలో రోహిణి, రావు రమేష్, అచ్యుత్ కుమార్, బలగం జయరామ్, హరి తేజ, ప్రవీణ్, వైవా హర్ష తదితరులు ఇతర ముఖ్య తారాగణం.
‘మానాడు, రంగం, మట్టి కుస్తి’ వంటి చిత్రాలకు పని చేసిన రిచర్డ్ ఎమ్ నాథన్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కథ, సంభాషణలను దర్శకుడు సుబ్బు మంగదేవి స్వయంగా రాశారు, స్క్రీన్‌ప్లేను విప్పర్తి మధు రాశారు, విశ్వనేత్ర అడిషినల్ స్క్రీన్‌ప్లే సహకారాన్ని అందించారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























