ఈ ఏడాది ‘టిల్లు స్క్వేర్’తో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఒకటి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న ‘తెలుసు కదా’ కాగా, మరొకటి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో ‘బేబి’ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్రాక్లింగ్ స్పీడ్‌తో సాగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయ్యింది. హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోన్న షెడ్యూల్లో కొన్ని నైట్ సీన్లను షూట్ చేస్తున్నారు. ఇందులో ప్రకాష్‌రాజ్, నరేష్, బ్రహ్మాజీ తదితరులతో హిలేరియస్ కామెడీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీరితో పాటు సిద్ధు కామెడీ టైమింగ్ లాఫింగ్ రైడ్‌లా ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందించనుంది. దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది.
ఈ నేపథ్యంలో హీరో సిద్ధు జొన్నలగడ్డ జాక్ విడుదల తేదీని ప్రకటించారు, ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్లలోకి రానున్నట్టు తెలిపారు. ఈ మేరకు తాజాగా సిద్ధు జొన్నలగడ్డ ఇన్స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. సరికొత్త జోనర్, ఫ్రెష్ కామెడీతో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. కంపోజర్ అచ్చు రాజమణి ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అద్భుతమైన సౌండ్ ట్రాక్‌ను సిద్ధం చేస్తున్నారు.
జాక్ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డ టైటిల్ రోల్‌ను పోషిస్తున్నారు. తనే క్రాక్ గాడు అనేలా ఎందుకుంటాడనేదే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్. విలక్షణమైన సినిమాలు చేయటానికి ఇష్టపడే సిద్ధు జొన్నలగడ్డ, బొమ్మరిల్లు భాస్కర్ కాంబోలో ఆడియెన్స్‌కు ఓ సరికొత్త ఎక్స్‌పీరియెన్స్‌ను అందించే చిత్రంగా జాక్ రూపొందుతోంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సీనియర్ ప్రొడ్యూసర్ బివిఎస్ఎన్.ప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
ఇక ఇదిలావుంటే, మరోవైపు ఇదే నెలలో క్వీన్ అనుష్క శెట్టి, క్రిష్ జాగర్లమూడి కాంబోలో వస్తోన్న ‘ఘాటి’ చిత్రం రిలీజ్ కానుంది. ఏప్రిల్ 18న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదలవుతోంది. అలాగే మే 1న నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కుతోన్న ‘హిట్ 3’ రిలీజ్ అవుతోంది. దీంతో ఈసారి సమ్మర్ సీజన్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























