ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ప్రపంచ స్థాయి నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను ఎంతో అత్యున్నతంగా హై బడ్జెట్‌తో నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
డిసెంబరు 5న చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. కాగా ఈ చిత్ర ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇటీవల బీహార్‌లోని పాట్నాలో జరిగిన పుష్ప-2 ట్రైలర్ లాంచ్ వేడుక ఇండియా మొత్తం హాట్‌టాపిక్‌గా నిలిచింది. చెన్నయ్‌లో జరిగిన వైల్డ్ ఫైర్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం మరో గ్రాండ్ ఈవెంట్ కేరళలోని కొచ్చిలో ఎంతో ఘనంగా జరిగింది.
ఈ నేపథ్యంలో కేరళలో మల్లు అర్జున్‌గా అత్యధిక అభిమానులు కలిగిన తెలుగు హీరోగా పేరున్న అల్లు అర్జున్‌కు అక్కడ అశేష జనాదరణ లభించింది. ఈ వేడుకకు అల్లు అర్జున్ అభిమానులు భారీగా హాజరవగా.. ఐకాన్ స్టార్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా సహా చిత్ర యూనిట్ అంతా పాల్గొని సందడి చేసింది. ఈ సందర్భంగా రష్మిక వేదికపై సామీ సామీ సాంగ్‌కు డ్యాన్స్ వేయగా.. అభిమానులు కేరింతలతో వేదిక ప్రాంగణాన్ని హోరెతించారు.
ఈ సందర్భంగా రష్మిక మందన్నా మాట్లాడుతూ.. “మీ స్వాగతం చూసి నా మైండ్ బ్లాంక్ అయ్యింది. మీ ప్రేమకు ఫిదా అయిపోయాను. అల్లు అర్జున్ మీద మీ ప్రేమ వెలకట్టలేనిది. అల్లు అర్జున్ నా జీవితంలో ఎప్పుడూ స్పెషల్ పర్సన్. ఐ ప్రామిసింగ్ యూ.. ఈ సినిమాలో ప్రతి బిట్‌ను అందరూ ఎంజాయ్ చేస్తారు. నాకు కుదిరితే కొచ్చి వచ్చి మీతో కలిసి సినిమా చూస్తాను. కేరళతో నా అనుబంధం చాలా గొప్పది. మీరంటే నాకు ఎంతో ప్రేమ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























