మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మూవీపై హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఓ వైపు అభిమానులు, మరోవైపు సినీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా గేమ్ ఛేంజర్ నుంచి ‘నానా హైరానా’ అనే లిరికల్ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది.
నానా హైరానా పాట తెలుగు లిరిక్స్..
నాదిర్ దిన్నా.. నాదిర్ దిన్నా.. నాదిర్ దిన్నా.. నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా.. దిల్లా.. నా దిన్నా
నాదిర్ దిన్నా.. నాదిర్ దిన్నా.. నాదిర్ దిన్నా.. నాదిర్ దిన్నా
నాదిర్ దిన్నా.. దిల్లా.. నా దిన్నా
పల్లవి:
నానా హైరానా ప్రియమైన హైరానా..
మొదలాయే నాలోన లలనా నీవలన..
నానా హైరానా అరుదైన హైరానా..
నెమలీకల పులకింతై నా చెంపలు నిమిరేనా..
దానాదీనా ఈ వేళ నీలోన నాలోన..
కనివినని కలవరమే సుమ షరమా..
వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే..
వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే..
వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే..
మంచోణ్ణవుతున్నా మరికొంచెం నువ్వు నా పక్కన ఉంటే..!
చరణం:
ఎపుడూ లేనేలేని వింతలు ఇపుడే చూస్తున్నా..
గగనాలన్నీ పూలగొడుగులు భువనాలన్నీ పాల మడుగులు..
కదిలే రంగుల భంగిమలై కనువిందాయెను పవనములు..
ఎవరులేనే లేని దీవులు నీకూ నాకేనా..
రోమాలన్నీ నేడు మన ప్రేమకు జెండాలాయె..
ఏమ్మాయో మరి ఏమో నరనరమూ నైలు నదాయే..
తనువేలేని ప్రాణాలు తారాడే ప్రేమలో
అనగనగా సమయములో తొలికథగా..!
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: