గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నుండి ఇప్పటివరకు రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఒకదాన్ని మించి ఇంకోటి హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు మూడో పాట కూడా రానుంది.నానా హైరానా అంటూ సాగే ఈ సాంగ్ మెలోడీ సాంగ్ గా రానుంది. ఇక ఈసాంగ్ ఎలా వుండనుందో నిన్న ఓ వీడియో ద్వారా చెప్పేశారు.కార్తీక్ ,శ్రేయా ఘోషల్ వోకల్స్ అందించగా థమన్ సూపర్ ట్యూన్స్ ఇచ్చాడు.వీడియోలో కొంచెం సాంగ్ ను కూడా రివీల్ చేశారు. అదే ఇప్పుడు లూప్ లో వింటున్నారు.ఇక ఫుల్ సాంగ్ వస్తే ఏ రేంజ్ లో వ్యూస్ వస్తాయో.రేపు ఈ సాంగ్ రిలీజ్ కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గేమ్ ఛేంజర్ షూటింగ్ కూడా దాదాపుగా పూర్తియైనట్లే.డిసెంబర్ నుండి ఈసినిమా ను భారీ లెవల్లో ప్రమోట్ చేయనున్నారు.స్టార్ డైరెక్టర్ శంకర్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా రామ్ చరణ్ సరసన కియరా అద్వానీ నటిస్తుంది.శ్రీకాంత్,ఎస్ జె సూర్య ,కిక్ శ్యామ్ ,అంజలీ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.జనవరి 10న గేమ్ ఛేంజర్ తెలుగుతోపాటు తమిళ ,హిందీ భాషల్లో థియేటర్లలోకి రానుంది.
ఇక రామ్ చరణ్ ప్రస్తుతం తన 16వ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ మైసూర్ లో స్టార్ట్ అయ్యింది.బుచ్చి బాబు సన డైరెక్షన్ లో రూరల్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























