బచ్చల మల్లి టీజర్ రానుంది

Bachhala Malli teaser gets a release date

అల్లరి నరేష్ టైటిల్ రోల్ లో నటిస్తున్న చిత్రం బచ్చల మల్లి.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఇందులో నరేష్ ఊర మాస్ లుక్ లో కనిపించనున్నాడు. పోస్టర్లు అలాగే రీసెంట్ గా వచ్చిన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈసినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి.ఇప్పటికైతే సినిమా మినిమమ్ గ్యారెంటీ అనేలా వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి కీలకమైన టీజర్ ను విడుదలచేయనున్నారు.రేపు ఈ టీజర్ ఈవెంట్ జరుగనుంది.ఏఏఏ సినిమాస్ లో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈవెంట్ జరుగనుండగా 4: 05 గంటలకు టీజర్ యూట్యూబ్ లోకి రానుంది.సుబ్బు ఈసినిమాను తెరకెక్కి స్తుండగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది.విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.సామజవరగమన,ఊరు పేరు భైరవకోన వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన హాస్య సినిమాస్ ఈసినిమాను నిర్మిస్తుంది. డిసెంబర్ 20న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఇక ఈ ఏడాది నా సామిరంగ ,ఆ… ఒక్కటీ అడక్కు సినిమాలతో ప్రేక్షకులముందుకు వచ్చాడు నరేష్.ఇందులో నా సామిరంగ సూపర్ హిట్ అయ్యింది.మరి ఇప్పుడు హీరోగా వస్తున్న బచ్చల మల్లి అల్లరి నరేష్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.