150 కోట్లు దాటిన అమరన్

amaran cross 150cr mark in tamil nadu

శివ కార్తికేయన్ అమరన్ విడుదలై నాలుగు వారాలైనా బాక్సాఫీస్ వద్ద జోరు తగ్గడం లేదు.ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను సొంతం చేసుకుంటుంది.ఇక ఈసినిమా తమిళనాడులో 150కోట్ల మార్క్ ను క్రాస్ చేసింది.దాంతో అక్కడ అత్యధిక వసూళ్లను రాబట్టిన 6వ సినిమాగా అమరన్ రికార్డు సృష్టించింది.ప్రస్తుతం విక్రమ్ తరువాతి స్థానం లో కొనసాగుతుంది.ఓవరాల్ గా చూస్తే అమరన్ ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకుపైగా కలెక్షన్స్ ను రాబట్టి ఈ ఏడాది అత్యధిక వసూళ్లను రాబట్టిన రెండో తమిళ సినిమాగా రికార్డు క్రీయేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అటు తెలుగులోనూ ఈసినిమా సత్తా చాటింది. నిన్నటి వరకు 40 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బయ్యర్లకు ఊహించని లాభాలు తీసుకొస్తుంది.రీసెంట్ గా ఏ తమిళ సినిమా కూడా ఈరేంజ్ వసూళ్లను రాబట్టలేదు.హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్ ఈసినిమాను తెలుగులో విడుదలచేసింది.ఇక థియేట్రీకల్ రన్ సూపర్ గా ఉండడం తో ఓటిటి రిలీజ్ ఆలస్యం కానుంది.వచ్చే నెల రెండో వారంలో స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ వుంది.నెట్ ఫ్లిక్స్ ఈ హక్కులను దక్కించుకుంది.

మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈసినిమాలో మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి పాత్రలో సాయి పల్లవి నటించింది.జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ నిర్మించింది.

ఇక శివ కార్తికేయన్ ప్రస్తుతం ఏఆర్ మురగదాస్ డైరెక్షన్ లో నటిస్తున్నాడు.అమరన్ బ్లాక్ బాస్టర్ కావడంతో ఈసినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.ఇందులో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.ఈసినిమా తరువాత శివ కార్తికేయన్ తన నెక్స్ట్ సినిమాను ఆకాశం నీ హద్డురా ఫేమ్ సుధా కొంగర తో చేయనున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.