హీరో నితిన్ – డైరెక్టర్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమా రాబిన్ హుడ్.శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.నితిన్ కెరీర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు మొదటి సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.వన్ మోర్ టైమ్ అంటూ వచ్చిన ఈ సాంగ్ వినడానికి బాగుంది.విద్యా వోక్స్ అలాగే సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ ఈసాంగ్ ను పాడారు.లిరికల్ వీడియోలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి.విదేశాల్లో ఈసాంగ్ ను షూట్ చేయగా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.డిసెంబర్ 25న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నారు.మైత్రి మూవీ మేకర్స్ ఈసినిమాను నిర్మిస్తుంది.నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో గతంలో వచ్చిన భీష్మ సూపర్ హిట్ అనిపించుకుంది.దాంతో ఇదే కాంబో లో వస్తున్న రాబిన్ హుడ్ పై మంచి అంచనాలు వున్నాయి.
ఇక నితిన్ ప్రస్తుతం ఈసినిమాతోపాటు తమ్ముడు అనే సినిమా కూడా చేస్తున్నాడు.వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మహా శివరాత్రికి థియేటర్లోకి రానుంది.ఈసినిమా తరువాత నితిన్, బలగం ఫేమ్ వేణు తో ఎల్లమ్మ అనే సినిమా చేయనున్నాడు.ఈసినిమాను కూడా దిల్ రాజునే నిర్మించనున్నారు.త్వరలోనే ఈసినిమాకు సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























