ఓవైపు అక్కినేని నాగ చైతన్య పెళ్లి పనులు జరుగుతుంటే ఇంతలో మరో గుడ్ న్యూస్ చెప్పారు కింగ్ నాగార్జున. వచ్చే నెల 4న నాగ చైతన్య -శోభిత ల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో గ్రాండ్ గా జరుగనుందని తెలిసిందే.ఇక ఈరోజు తన చిన్న కొడుకు అక్కినేని అఖిల్ నిశ్చితార్థం అయ్యిందని నాగార్జున సప్ ప్రైజ్ ఇచ్చారు.జైనబ్ రవడ్జీ తో అఖిల్ కు ఎంగేజ్ మెంట్ జరిగింది.ఈ న్యూస్ ను తను రివీల్ చేసే వరకు బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు నాగార్జున.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఎంగేజ్ మెంట్ విషయాన్ని నాగార్జున ,ఎక్స్ ద్వారా పంచుకొని అఖిల్ ,జైనబ్ ల పోటోలను పోస్ట్ చేశారు.అయితే ఇంకా పెళ్లి తేదీని ఖరారు చేయలేదు. ఇక అఖిల్ అక్కినేని తన సంతోషాన్ని ఇంస్టా గ్రామ్ ద్వారా పంచుకున్నాడు.తన కలల రాణి దొరికిందని సంతోషంగా నిశ్చితార్థం చేసుకున్నామని పోటోలను షేర్ చేశాడు.
సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఏజెంట్ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు అక్కినేని అఖిల్.ఆ సినిమా తరువాత ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాను ప్రకటించలేదు.అయితే వినరో భాగ్యము విష్ణు కథ డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు తో అఖిల్ నెక్స్ట్ సినిమాను చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి.అన్నపూర్ణ స్టూడియోస్ ఈసినిమాను నిర్మించనుందట.మరి ఈ వార్తల్లో నిజం ఉందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: