అద్భుతమైన లొకేషన్స్‌లో.. వెంకీ-మీనాక్షి లపై సాంగ్

Sankranthiki Vasthunam Filming Beautiful Song on Venkatesh and Meenakshi Chaudhary

మచ్ అవైటెడ్ క్రేజీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేసినట్లుగా జనవరి 14న సంక్రాంతికి విడుదల కానుంది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, ప్రతిష్టాత్మక బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌లో ఈ చిత్రం రూపొందుతోంది. దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు ముందే హ్యుజ్ బజ్‌ని సృష్టిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా కనిపించనుంది. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం షూటింగ్ చివరి దశలో ఉంది. టీం ప్రస్తుతం వెంకటేష్, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పాత్ర పోషించిన మీనాక్షి చౌదరిపై ఒక బ్యూటీఫుల్ సాంగ్ నిచిత్రీకరిస్తోంది.

డెహ్రాడూన్, ముస్సోరీ, రిషికేశ్‌లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. భాను మాస్టర్ ఈ పాట కొరియోగ్రఫీని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్‌లో యూనిట్ ఈ పాటను మాత్రమే చిత్రీకరిస్తోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించారు.

త్వరలోనే మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

కాగా ఈ చిత్రంలో భారీ తారాగణం నటిస్తోంది. ‘యానిమల్’ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్ సహా VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.