యంగ్ హీరో కిరణ్ అబ్బవరం దీపావళికి క తో వచ్చి కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టాడు.ఈ సినిమా నిన్నటి వరకు 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.భారీ పోటీలో కూడా మంచి రన్ ను కనబర్చింది.ఇక క ఓటిటిలోకి వచ్చేస్తుంది.ఈటీవీ విన్ ఈసినిమా ఓటిటి హక్కులను దక్కించుకోగా ఈనెల 28నుండి స్ట్రీమింగ్ లోకి తీసుకరానున్నామని ప్రకటించింది.ఈసినిమాను డాల్బీ విజన్ అట్మాస్ లో అందుబాటులోకి తీసుకురానుంది.సో థియేటర్లలో మిస్ అయిన వారు క ను ఓటిటి లో చూసేయొచ్చు.మరి థియేటర్లలో సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈసినిమా ఓటిటిలో ఎలాంటి టాక్ ను రాబడుతుందో చూడాలి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా రీసెంట్ గానే మలయాళంలో కూడా విడుదలయ్యింది.హీరో దుల్కర్ సల్మాన్ ఈసినిమాను కేరళలో రిలీజ్ చేయగా డీసెంట్ రెస్పాన్స్ వస్తుంది.సుజీత్,సందీప్ తెరకెక్కించిన ఈసినిమాలో ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.సామ్ సీఎస్ సంగీతం అందించాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.ఈసినిమాకు సీక్వెల్ కూడా రానుంది.అయితే ఇప్పుడప్పుడే ఈ సీక్వెల్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ లేదు.
ఇక వరుస పరాజయాల తరువాత కిరణ్ అబ్బవరం క తో హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు.ఈసినిమా తరువాత తను నెక్స్ట్ చేయబోయే సినిమాకు కూడా డిఫ్రెంట్ సబ్జెక్టు ను ఎంచుకోవాలని చూస్తున్నాడు.త్వరలోనే కిరణ్ నెక్స్ట్ సినిమా అప్డేట్ రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: