సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మానస వారణాసి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నవదళపతి సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్లుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా హీరో అశోక్ గల్లా తన మామయ్య, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ కార్యక్రమానికి రాకపోవడానికి గల కారణాలు వివరించారు. అశోక్ గల్లా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వచ్చిన అందరికీ థాంక్యూ సో మచ్. మనం కష్టపడితే ఏదైనా మనకి వస్తుందని సుధీర్ బాబు గారిని చూసి నేర్చుకున్నాను .అదే నన్ను ముందుకు నడిపిస్తుంది.”
“ప్రశాంత్ వర్మ ఒక సినిమాతో వస్తున్నారంటే అది ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ స్క్రిప్ట్ ఇచ్చారు. డెఫినెట్‌గా ఇది ఇంట్రెస్టింగ్, ఎక్సయిటింగ్‌గా వుంటుంది. ఆయన కథ ఇచ్చారు కాబట్టి ఈ ప్రాజెక్టు అయింది. బాలా గారు చాలా గ్రాండ్‌గా ఈ సినిమాని తీశారు. అర్జున్ గారు చాలా గ్రేట్ విజన్‌తో ఈ సినిమాని అద్భుతంగా తలకెక్కించారు. అందుకే ప్రోడక్ట్ ఇంత అద్భుతంగా ఉంది.”
“మహేష్ బాబు గారు, ఎస్ఎస్ రాజమౌళి గారి సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. మీ అందరినీ అలరించడానికి లుక్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు. అందుకే ఈ ఈవెంట్‌కి రాలేకపోయారు. ఆయన ఈ వేడుకలో లేకపోయినా ఆయన ఎప్పుడూ నాకు అండగానే ఉంటారు. ఆయన చెయ్యి ఎప్పుడూ నా భుజం మీద ఉంటుంది. అందులో డౌట్ లేదు.”
“దేవదత్త గారు చాలా పవర్ఫుల్ విలన్ క్యారెక్టర్ చేశారు. ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. మానసకి ఇది తొలి సినిమా కానీ ఎక్కడ తొలి సినిమాలా ఉండదు. తనే తన క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పింది. మా సినిమా గురించి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాము. మీరు డెఫినెట్‌గా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో మీ ప్రేమ అభిమానం, నాకు కూడా కొంచెం వస్తుందని ఆశిస్తున్నాను. థాంక్యూ. నవంబర్ 22 థియేటర్స్ లో కలుద్దాం” అని అన్నారు హీరో అశోక్ గల్లా.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























