నాలోని సత్యభామని ఆయనే బయటికి తీసుకొచ్చారు

Actress Manasa Varanasi Excited For Devaki Nandana Vasudeva Release

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నవదళపతి సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

ఈ సందర్భంగా చిత్ర హీరోయిన్ మానస వారణాసి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈ సినిమా కోసం ఎక్సైటెడ్‌గా ఎదురు చూస్తున్నాను. ఈ కమర్షియల్ డివైన్ థ్రిల్లర్‌లో అన్ని ఎలెమెంట్స్ ఉన్నాయి. స్టోరీని ఎలివేట్ చేయడానికి బీమ్స్ గారు అద్భుతమైన మ్యూజిక్‌ని కంపోజ్ చేశారు. ఇలాంటి ఒక బ్యూటిఫుల్ టీంతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాతో సినిమా గురించి చాలా నేర్చుకున్నాను” అని తెలిపారు.

ఇంకా ఆమె మాట్లాడుతూ.. “అర్జున్ గారు చాలా సపోర్ట్ చేశారు. ఒక గురువు లాగా ఉన్నారు. నాలోని సత్యభామని బయటికి తీసుకొచ్చారు. నిర్మాత బాల గారికి కంగ్రాజులేషన్స్. చాలా పాషన్‌తో ఈ సినిమా తీశారు. ఇది వారి బ్యానర్‌లో మైల్ స్టోన్ మూవీకి నిలుస్తుంది. అశోక్ గారితో వర్క్ చేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. చాలా అంకితభావంతో పని చేశారు. నటిగా అర్థవంతమైన కథలు చెప్పాలని తొలి అడుగు వేస్తున్నాను. నవంబర్ 22న థియేటర్స్‌లో కలుద్దాం. థాంక్యూ” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.