సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నవదళపతి సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ ఈవెంట్‌లో హీరో సుధీర్ బాబు యువ నటుడు అశోక్ గల్లా గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా నవదళపతి ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. అశోక్ తన ఫస్ట్ సినిమా ‘హీరో’తో యాక్టర్‌గా మంచి మార్కులు తెచ్చుకున్నాడు. సెకండ్ సినిమాకి ఇలా స్ట్రాంగ్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సబ్జెక్ట్ చేయడం రిస్కీ. కాకపోతే తన కటౌట్ కమర్షియల్ హీరోకి కరెక్ట్‌గా సెట్ అవుతుంది.”
“ఈ సినిమా ట్రైలర్ విజువల్స్ సాంగ్స్ చూసినప్పుడు తనకి పర్ఫెక్ట్ స్టొరీ అనిపించింది. తను కచ్చితంగా కమర్షియల్ హీరోగా సక్సెస్ అవుతాడు. అశోక్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. సినిమా అంటే తనకి చాలా పాషన్. అశోక్ చాలా మంచి హీరోగా ఇక్కడ సెటిల్ అవుతాడు. నిర్మాత బాలా గారి దగ్గర ఒక స్టార్ ప్రొడ్యూసర్ క్వాలిటీ ఉంది. మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా హానెస్ట్‌గా మాట్లాడుతారు. ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను.”
“మానసకి చాలా లాంగ్ కెరియర్ ఉంటుందని నమ్ముతున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. వెల్కమ్ టు ది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. డైరెక్టర్ అర్జున్‌గా హానెస్ట్‌గా మాట్లాడారు. ఇదే హానెస్టీ మేకింగ్‌లో ఉంటే ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ట్రైలర్ చూస్తున్నప్పుడు బోయపాటి గారి రిఫరెన్స్ కనిపిస్తుంది. ఇంత మంచి స్క్రిప్ట్ ఇచ్చిన ప్రశాంత్‌కి థాంక్యూ. నవంబర్ 22న అందరూ థియేటర్స్ లోనే ఈ సినిమా చూడండి. థాంక్యూ” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: