టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మిస్తుండగా.. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీలో అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ పాలకొల్లు లో సాంగ్ షూటింగ్ మొదలుపెట్టారు. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, హీరోయిన్ అదితి శంకర్ పై క్యూట్ లవ్ సాంగ్ ని చిత్రీకరిస్తున్నారు.
విజయ్ పోలాకి మాస్టర్ ఈ సాంగ్ కి కొరియోగ్రఫీ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల చార్ట్ బస్టర్ ట్యూన్ ని కంపోజ్ చేశారు. మేకర్స్ షేర్ చేసి స్టిల్స్ లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లుంగీ, షేడ్స్ తో రగ్గడ్ అండ్ మ్యాసీ అవతార్ లో, హీరోయిన్ అదితి శంకర్ పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకున్నారు.
కాగా నియో-నోయిర్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీలో ప్రముఖ తారాగణం సందడి చేస్తుండగా.. పేరొందిన సాంకేతిక సిబ్బంది పనిచేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ ముగ్గురూ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే హరి కె వేదాంతం సినిమాటోగ్రాఫీ, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తుండగా.. ఛోటా కె ప్రసాద్ ఎడిటర్‌గా, బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి సత్యర్షి, తూమ్ వెంకట్ డైలాగ్స్ రాస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























