సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన సెకండ్ మూవీ ‘దేవకి నందన వాసుదేవ’తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. ఈ చిత్రానికి ‘గుణ 369’తో హిట్ కొట్టిన అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ‘హనుమాన్’ ఫేమ్ ప్రశాంత్ వర్మ కథ అందించడం విశేషం. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మానస వారణాసి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. నవంబర్ 22 ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నవదళపతి సుధీర్ బాబు స్పెషల్ గెస్ట్‌లుగా పాల్గొన్నారు. మూవీ యూనిట్ అంతా పాల్గొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.
ఈ సందర్భంగా చిత్ర డైరెక్టర్ అర్జున్ జంధ్యాల దేవకి నందన వాసుదేవ విశేషాలు వివరించారు.. అర్జున్ జంధ్యాల ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “అందరికీ నమస్కారం. మహేష్ బాబు గారు, బాలకృష్ణ గారు ఒక దర్శకుడిని నమ్మితే వాళ్లకి ఇచ్చే విలువ అంత ఇంత కాదు. అలాగే మా హీరో అశోక్ కూడా డైరెక్టర్‌కి అంతే విలువ ఇచ్చిన యాక్టర్. అశోక్ ఇచ్చిన సపోర్ట్ మర్చిపోలేను. కలిసికట్టుగా పని చేశాము. అందుకే ఇంత అద్భుతమైన అవుట్ పుట్ వచ్చింది.”
“ఈ సినిమాలో సాయి మాధవ్ బుర్రా గారు దేవుడంటే సాయం అనే డైలాగ్ రాశారు. ఈ సినిమాకి ప్రేక్షకులు రావాలంటే బలమైన వ్యక్తుల సహాయం కావాలి. అంత బలంగా మా సినిమా వెనుక నిలబడడానికి వచ్చిన సుధీర్ బాబు గారికి, నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన ప్రశాంత్ వర్మ గారికి, జయదేవ్ గారికి ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇక మా బాస్ మాస్ కల్ట్ డైరెక్టర్ బోయపాటి గారు ఈ వేడుకకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు.”
“ప్రశాంత్ గారు ఈ సినిమా కథ ఇచ్చారు. సినిమా అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆయనకి చూపించాను. చూసి ఆయన చాలా సర్ ప్రైజ్ ఫీల్ అయ్యారు. చాలా అద్భుతంగా డెవలప్ చేసి తీశావ్ అన్నారు. హనుమాన్ లాంటి సినిమా తర్వాత ఆయన ఆ వర్డ్స్ చెప్పడం నా ఫస్ట్ సక్సెస్. థాంక్యూ ప్రశాంత్ గారు. ఈ సినిమా మీద నమ్మకంతో నిర్మాత బాల గారు మొదటి పది నిమిషాలు ముందే చూపించాలని నిర్ణయించుకున్నారు. ఇంత బలంగా సినిమా నమ్మిన బాల గారికి థాంక్యూ సో మచ్.”
“ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు అద్భుతమైన సినిమాని తీశారని ప్రశంసిస్తారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమాకి భీమ్స్ తన మ్యూజిక్ తో ప్రాణం పోశాడు. సాంగ్స్ ఆర్ఆర్ అద్భుతంగా ఉంటాయి. 22 తారీఖున ఈ సినిమా చూడండి. కొత్త కంటెంట్. డివైన్ థీంతో తీసిన సినిమా. ఇప్పటివరకు ఇలాంటి సినిమా రాలేదు. ఒక అద్భుతమైన సినిమాని విజువల్స్ ని మీరు ఎంజాయ్ చేస్తారు. అందరికీ థాంక్యూ సో మచ్” అని అన్నారు దర్శకుడు అర్జున్ జంధ్యాల.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: