మెకానిక్ రాకీ ట్రైలర్ 2.0 వచ్చేసింది

Vishwak Sen's Mechanic Rocky Trailer 2.0 Released

టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మెకానిక్ రాకీ’ ఫస్ట్ గేర్, ట్రైలర్ 1.0, సాంగ్స్‌తో మార్కెట్‌లో హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. #VS10 ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి వహించడంతోపాటు రచన కూడా చేస్తున్నాడు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్‌లో కనిపించనుండగా.. మరో స్టార్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్‌ కూడా నటిస్తోంది. అలాగే సీనియర్ నటుడు నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. ఈ చిత్రం నవంబర్ 22న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఆదివారం వరంగల్‌లో ‘మెకానిక్ రాకీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే. భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా మంగళవారం ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్ 2.0 లాంచ్ చేశారు మేకర్స్. ట్రైలర్‌లో విశ్వక్ అదరగొట్టేసాడు. మొత్తానికి ట్రైలర్ అయితే సినిమాపై అంచనాలను మరింతగా పెంచేస్తోంది.

ఇక ఇదిలావుంటే, ఈరోజు మెకానిక్ రాకీ టీమ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోనుంది. దీని తర్వాత వరుసగా పలు ప్రమోషనల్ ఈవెంట్స్ నిర్వహించనుంది. దీనిలో భాగంగా రేపు ప్రెస్ పార్టీ, ఈనెల 21న ఏఎంబీ సినిమాస్‌లో ప్రీమియర్.. అలాగే 22న సుదర్శన్ థియేటర్‌లో ఫస్ట్ షో వీక్షించనున్నారు. కాగా హైబడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డీవోపీగా మనోజ్ కటసాని, ఎడిటర్‌గా అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్‌గా క్రాంతి ప్రియం అవంతి టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.