సౌత్ లో ప్రస్తుతం వున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో తమన్ ఒకరు.ఎప్పుడు చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉంటాడు ఈ మ్యూజిక్ డైరెక్టర్. అయితే ఈ సారి ఇంకాస్త ఎక్కువగా సినిమాలు ఒప్పుకున్నాడు.తన ఖాతాలో ప్రస్తుతం 10 సినిమాలు వున్నాయి.అందులో కమిట్ అయినవన్నీ దాదాపు పెద్ద సినిమాలే.ఆ సినిమాలు ఏంటంటే … బాలకృష్ణ , డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్ కు తమన్ సంగీతం అందింస్తున్నాడు.రీసెంట్ గా ఈ సినిమా గ్లింప్స్ రిలీజ్ చేయగా దీనికి తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది అలాగే రామ్ చరణ్ ,శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ కు కూడా తనే మ్యూజిక్ అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక పవన్ కళ్యాణ్ -సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న ఓజీ , ప్రభాస్ -మారుతి ది రాజా సాబ్ ,బాలకృష్ణ -బోయపాటి శ్రీనుల అఖండ2 ,యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తెలుసు కదా అలాగే శబ్దం వీటితోపాటు హిందీ లో వరుణ్ ధావన్ బేబీ జాన్ ,సన్నీ డియోల్ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వస్తున్న జాట్ సినిమాలకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇవికాకుండా రీసెంట్ గా పుష్ప 2 ఫస్ట్ హాఫ్ కి తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
ఇక అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ కి కూడా తమన్ నే తీసుకున్నారు.త్రివిక్రమ్ ఈసినిమా ను డైరెక్ట్ చేయనున్నాడు.భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ ,హారిక హాసిని క్రియేషన్స్ నిర్మించనున్నాయి. ఫిబ్రవరిలో ఈసినిమా లాంఛ్ అయ్యే ఛాన్స్ వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























