తండేల్ ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే

Thandel First Single release date out

లవ్ స్టోరి తరువాత నాగ చైతన్య,సాయి పల్లవి కలిసి నటిస్తున్న సినిమా తండేల్.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.కార్తికేయ 2 ఫేమ్ చందు మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.ఈసినిమాపై మంచి అంచనాలు వున్నాయి.ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ బుజ్జి తల్లి ఈనెల 21న రిలీజ్ కానుంది.ఇక ఈనెల 23న చైతన్య తన బర్త్ డే ను జరుపుకోనున్నాడు. అయితే అంతకన్నా రెండు రోజుల ముందే ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు.సో బర్త్ డే రోజు మరో అప్డేట్ ఇచ్చే ఛాన్స్ వుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీకాకుళంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది.ఇందులో చైతన్య బోటు డ్రైవర్ గా కనిపించనున్నాడు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్,బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.ఫిబ్రవరి 7న ఈసినిమా థియేటర్లోకి రానుంది.

ఈసినిమాపై అక్కినేని ఫ్యాన్స్ అయితే భారీ ఆశలు పెట్టుకున్నారు.ఈమధ్య కాలంలో నాగ చైతన్య కు సరైన హిట్ పడలేదు.దాంతో తండేల్ తో ఎలాగైనా హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.ఇక సాయి పల్లవి మాత్రం రీసెంట్ గా అమరన్ తో భారీ హిట్ అందుకుంది.ఈసినిమా తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.మరి తండేల్ తో ఫామ్ కొనసాగిస్తుందో చూడాలి.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.