టాలెంటెడ్ హీరో సత్య దేవ్, కన్నడ స్టార్ డాలీ ధనంజయ హైలీ యాంటిసిపేటెడ్ మల్టీ స్టారర్ జీబ్రా. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్‌ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా జీబ్రా ట్రైలర్ రిలీజన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ అంచనాల నడుమ జీబ్రా చిత్రం నవంబర్ 22న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా కన్నడ స్టార్ డాలీ ధనంజయ సినిమా విశేషాల్ని పంచుకున్నారు.
జీబ్రాలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది?
- జీబ్రాలో బ్యాంక్, గ్యాంగ్ స్టర్ రెండు వరల్డ్స్ వున్నాయి. ఇందులో నాది పవర్ ఫుల్ ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ రోల్.
- సినిమా అంతా బ్యాంక్ చుట్టూ వుండే ఆర్ధిక నేరాలు చుట్టూ ఉంటుంది.
- మనం చాలా ఫైనాన్సియల్ క్రైమ్స్ గురించి వింటా ఉంటాము.
- ఒక కామన్ మ్యాన్ గా మనకి బ్యాంక్ లావాదేవీల గురించి అంత లోతుగా తెలీదు.
- ఈ సినిమా బ్యాంకింగ్ సిస్టం, అందులోని ఫైనాన్సియల్ క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది.
- దర్శకుడు ఈశ్వర్ ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ కథని రాశాడు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది.
డైరెక్టర్ ఈశ్వర్ ఈ కథ చెప్పినపుడు ఎలా అనిపించింది?
- నేను చాలా సర్ ప్రైజ్ అయ్యాను. ఫైనాన్సియల్ క్రైమ్ గురించి వింటా వుంటాం.
- కానీ అవి ఎలా జరుగుతాయో తెలీదు.
- దర్శకుడు ఈ కథ చెప్పినపుడు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆయన బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చారు.
- ఈశ్వర్ జీబ్రాని అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కూడిన మాస్ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దాడు.
- కామెడీ, ఫన్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ని చక్కగా బ్లెండ్ చేశాడు. జీబ్రా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది.
సత్యదేవ్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
- సత్యదేవ్ వెరీ ఆర్గానిక్ అండ్ వెర్సటైల్ యాక్టర్. నాకు చాలా మంచి స్నేహితుడు.
- సత్యతో వర్క్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను.
- ఈ సినిమా మాకు మంచి విజయాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది.
- ఈ సినిమాలో ప్రతి పాత్ర కీలకంగా వుంటుంది. అన్ని క్యారెక్టర్స్ కి కథలో ప్రాముఖ్యత వుంటుంది.
నిర్మాతల గురించి?
- ఎస్‌ఎన్ రెడ్డి, బాల, దినేష్ సినిమా అంటే చాలా పాషన్ వున్న నిర్మాతలు.
- సినిమాకి కావాల్సినది సమకూర్చారు. చాలా గ్రాండ్ గా నిర్మించారు.
రవి బస్రూర్ మ్యూజిక్ గురించి?
- రవి బస్రూర్ ఎక్స్ ట్రార్డినరీ మ్యూజిక్ ఇచ్చారు.
- ఆయన కేజీఎఫ్, సలార్ సినిమాకి ఎంత అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారో అందరికీ తెలుసు.
- జీబ్రా లో మాత్రం కొత్త రవి బస్రూర్ ని చూస్తారు.
- మ్యూజిక్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బీజీఎం అదిరిపోతుంది.
తెలుగు ప్రేక్షకులు మిమ్మల్ని జాలి రెడ్డిగా పిలుస్తుంటారు ఎలా అనిపిస్తుంది?
- పుష్ప సినిమాలోని జాలి రెడ్డి పాత్ర నా కెరీర్ లో మెమరబుల్.
- తెలుగు ప్రేక్షకులు మన జాలి రెడ్డి అని వోన్ చేసుకోవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.
- ఆ పాత్రకు ప్రేక్షకులు ఇచ్చిన ప్రేమని మర్చిపోలేను.
- తెలుగులో మరిన్ని సినిమాలు చేసి ఆడియన్స్ ని అలరించాలని వుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































