నేను ఇంత పెద్ద ఈవెంట్ చూడటం ఇదే మొదటిసారి

Distributor Anil Thadani Interesting Comments on Pushpa 2 Trailer Launch Event

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తూ త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న తాజా చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్‌గా రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్‌గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. ఈ నేపథ్యంలో ఆదివారం బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ లాంచ్ చేసింది చిత్ర యూనిట్.

బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సేన సాహెబ్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుమారు 900 మంది పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ వ్యక్తుల మధ్య ఈ ఈవెంట్ జరగడం విశేషం. బీహార్ రాష్ట్రంలో ఎన్నడూ లేనివిధంగా సుమారు మూడు లక్షల మందికి పైగా ఓ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగడం ఇదే ప్రథమం.

ఇక ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకకు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన్నా, నిర్మాతలు రవిశంకర్, నవీన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుష్ప 2 సినిమాకు హిందీలో డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరిస్తున్న అనిల్ తడాని మాట్లాడుతూ.. “ఈ చిత్రానికి ఇంతటి జనాదరణ పొందడం ఎంతో సంతోషకరంగా ఉంది. అల్లు అర్జున్ గారు ఇటువంటి చరిత్రను సృష్టించారు. ఇదే నేను థియేటర్లో కూడా చూడాలనుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మైత్రి మూవీ మేకర్స్ రవి గారికి, నవీన్ గారికి ధన్యవాదాలు. మీరు పాట్నాలో ఈ ఈవెంట్ తో ఎలా అయితే ఈ ఈవెంట్ తో చరిత్రను సృష్టించారో, ఈ చిత్రం కూడా అలాగే చరిత్రను సృష్టించాలని కోరుకుంటున్నాను. ఇటువంటి పెద్ద ఈవెంట్ ను నేను చూడటం ఇదే మొదటిసారి. అందుకుగాను కారణం అయిన అల్లు అర్జున్ కు నా ధన్యవాదాలు” అని అన్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.