ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ఇంతకుముందు వీరి కాంబోలోనే వచ్చిన ‘పుష్ప: ది రైజ్’ చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తుండగా.. ప్రముఖ మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ సూపర్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబరు 5న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. దాదాపు 12,000 స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచేసింది. పుష్ప 2 ట్రైలర్ కోసం అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రేపు బీహార్‌లో జరగనుంది. దీనిని గ్రాండ్‌గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. పట్నా లోని గాంధీ మైదాన్ వేదికగా రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.
ఇక పుష్ప 2: ది రూల్ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటులు జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































