ధ‌నుష్‌కు న‌య‌న‌తార బహిరంగ లేఖ, నెట్టింట వైరల్

Nayanthara Open Letter To Hero Dhanush Ahead of Netflix Documentary Streaming

కోలీవుడ్ స్టార్స్ మధ్య వివాదం నెలకొంది. స్టార్ హీరో ధ‌నుష్‌కు లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఆమె తను నటించిన ఒక సినిమాకు సంబంధించి ఫోటోలు, పాటలు, వీడియో క్లిప్స్ తదితర ప్రచార చిత్రాలను వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ధ‌నుష్‌ వైఖరిని విమర్శిస్తూ ఓపెన్ లెటర్ రాశారు. ఈ సంద‌ర్భంగా ఆ బహిరంగ లేఖను ఎక్స్ వేదిక‌గా వెల్లడించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వివరాల్లోకి వెళ్తే.. నటి నయనతార సినీ ప్రయాణం స్పూర్తితో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. ‘న‌య‌న‌తార‌: బియాండ్ ద ఫెయిరీ టేల్’ అనే టైటిల్‌తో రూపొందిన ఈ డాక్యుమెంటరీ నవంబర్ 18 నుంచి ప్రసారం కానుంది. ఇందులో నయనతార వ్యక్తిగత జీవితంతోపాటు, ఆమె నటించిన హిట్ సినిమాలలోని కొన్ని సీన్స్, సాంగ్స్ చూపించనున్నారు.

దీనిలో భాగంగా నయనతార కథానాయికగా నటించిన ‘నానుమ్ రౌడీ దాన్’ (తెలుగులో.. నేనూ రౌడీనే) అనే సినిమా లోని కొన్ని సన్నివేశాలను ప్రదర్శించాలని డాక్యుమెంటరీ టీమ్ భావించింది. ఎందుకంటే.. ఈ మూవీ నయనతారకు చాలా స్పెషల్. నయన్, విజయ్ సేతుపతి జంటగా నటించిన ఈ చిత్రానికి దర్శకుడు విఘ్నేష్ శివన్. ఈ సినిమా సమయంలో మొదలైన నయన్, విఘ్నేష్ పరిచయం ఆపై పెళ్లి వరకూ దారితీసింది.

ఈ నేపథ్యంలో డాక్యుమెంటరీలో నానుమ్ రౌడీ దాన్ చిత్రానికి సంబంధించి ఒక స్పెషల్‌ వీడియో క్లిప్ ఉప‌యోగించారు. అయితే ఈ సినిమాకు హీరో ధనుష్ నిర్మాత. దీంతో త‌న అనుమ‌తి లేకుండా త‌న మూవీకి సంబంధించిన క్లిప్స్ ఉప‌యోగించ‌డం ప‌ట్ల ధ‌నుష్ సీరియ‌స్ అయ్యారు. కాపీ రైట్ యాక్ట్ కింద త‌న‌కు రూ.10 కోట్లు చెల్లించాలంటూ నోటీసులు పంపారు. దీనిపై న‌య‌నతార, ధ‌నుష్‌కి న‌చ్చ‌జెప్పే ప్ర‌య‌త్నం చేసినా అతడు వినిపించుకోలేదు.

దీంతో నయనతార ధ‌నుష్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ లేఖ సంధించారు. కేవలం మూడు సెకన్ల వీడియో క్లిప్ కోసం రూ. 10 కోట్లు డిమాండ్ చేయడం దారుణమని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. కాగా మరో రెండు రోజుల్లో నయనతార డాక్యుమెంటరీ స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ లేఖ వ్యవహారం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే నయన్ ఆరోపణలపై హీరో ధనుష్ స్పందించాల్సివుంది. ఇంతవరకూ ఆయన వైపు నుంచి ఈ వ్యవహారంపై ఎలాంటి ప్రకటనా రాలేదు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.