చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చిన నార్నె నితిన్ తనకంటూ ఓ పందాన్ని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు. అలాగే జాతీయ అవార్డు విన్నర్, “శతమానం భవతి” దర్శకులు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ గా రాబోతున్నారు. ఆయన సరసన సంపద హీరోయిన్‌గా నటిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించిన ఈ మూవీ అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. ఇదిలావుంటే, తాజాగా ఈ చిత్రం విడుదలకు సంబంధించి మేకర్స్ డేట్ అనౌన్స్ చేసారు. శ్రీ శ్రీ శ్రీ రాజావారు నవంబర్ 28న అత్యధిక థియేటర్లలో ప్రేక్షకులకు ముందుకు రానుంది.
కాగా ఈ చిత్రంలో రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్, రచ్చ రవి, సరయు, రమ్య, ప్రియ మాచిరాజు, భద్రం, ఆనంద్, జబర్దస్త్ నాగి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కైలాష్ మీనన్ సంగీతం సమకూర్చగా.. దాము నర్రావుల సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే ఈ సినిమాకు మధు ఎడిటర్ కాగా, శ్రీమణి సాహిత్యం సమకూర్చారు.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. “నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్‌లో మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. కచ్చితంగా ఈ నవంబర్ 28 న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్, మ్యాడ్ తరహాలో హ్యాట్రిక్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం” అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























