టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పెళ్లి చేసుకున్నారు. తాజాగా ఆయన డా. ప్రీతి చల్లాను రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. సింపుల్‌గా జరిగిన ఈ వేడుకలో ఇరువురి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ప్రీతి సాంప్రదాయ పైథాని చీరలో మెరవగా, క్రిష్ షేర్వాణీలో కనిపించారు. కాగా ప్రస్తుతం వీరి వెడ్డింగ్‌కి సంబంధించిన పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
క్రిష్ జాగర్లమూడి అద్భుతమైన కథా నైపుణ్యం, శక్తివంతమైన కథనాలను అందించే సామర్థ్యం వున్న దర్శకుడిగా ప్రశంసలు అందుకున్నారు. విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలని అందించడంలో క్రిష్ దిట్ట. సినిమా పట్ల తన ఆలోచనాత్మక విధానం, చరిత్ర, భావోద్వేగాలను సినిమా నైపుణ్యంతో మిళితం చేయడంలో అందరి ప్రశంసలు పొందారు.
ఇక వివాహ బంధంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, డాక్టర్ ప్రీతి లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రస్తుతం క్రిష్, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ప్రధానపాత్రలో ‘ఘాటి’ అనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రీతి చల్లా ఎవరు?
హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ ప్రీతి ఒక గైనకాలజిస్ట్. 2007 నుంచి ఆమె మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తున్నారు. చెన్నైలోని శ్రీరామచంద్ర విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు. అక్కడే గైనకాలజీలో ఎంఎస్ కూడా పూర్తి చేశారు. ఇక గ్రాడ్యుయేషన్ తర్వాత ఆమె తమ కుటుంబ వ్యాపారమైన ప్రముఖ చల్లా హాస్పిటల్‌లో వైద్యురాలిగా సేవలు అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























