విరుపాక్ష తరువాత మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ SDT 18 తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.కొత్త దర్శకుడు రోహిత్ కెపి ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా హనుమాన్ నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కొద్దీ రోజుల నుండి ఈసినిమా క్యాస్టింగ్ ను అనౌన్స్ చేస్తూ వస్తున్నారు మేకర్స్. అందులో భాగంగా శ్రీకాంత్ , జగపతి బాబు , సాయి కుమార్ లను కీలక పాత్రలకు తీసుకోగా ఇప్పుడు మరొకరు జాయిన్ అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ ను తీసుకున్నారు.ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించనుంది.ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తుంది.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ఇక రీసెంట్ గా పొట్టేల్ తో వచ్చి హిట్ కొట్టింది అనన్య నాగళ్ళ.గత నెలలో రిలీజైన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.అనన్య నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.ఇక ఇప్పుడు SDT 18వ సినిమాకు సైన్ చేసింది. ఇదే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా లైన్లో వున్నాయట.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























