ఇలాంటి దీపావళిని మళ్ళీ చూస్తామో, లేదో తెలియదు

Producer Dil Raju Interesting Comments Goes Viral in KA Success Meet

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో క సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోంది.

ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలోని యువతకు పలు కీలక సూచనలు చేశారు. ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలు దిల్ రాజు ఏమన్నారో ఆయన మాటల్లోనే.. “క సినిమా కంటెంట్ మొదటి నుంచీ చూస్తున్నాను. దాదాపు అంతా యంగ్ టీమ్ ఈ సినిమాకు వర్క్ చేశారు. ఈ సారి దీపావళికి బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ నెలకొంది. ఈ పోటీలో కూడా ఐదు సినిమాలు విజయాలు సాధించాయి. ఇలాంటి దీపావళి మరోసారి వస్తుందా లేదా అనేది చెప్పలేం.”

“ఆ పోటీలో క సినిమా తట్టుకుని నిలబడి ఘన విజయాన్ని అందుకోవడం మామూలు విషయం కాదు. మీరంతా మీ సినిమాను నమ్ముకుని హార్డ్ వర్క్ చేశారు. మీ టీమ్ అందరినీ ఒకసారి పర్సనల్ గా కలిసి మాట్లాడుతాను. క సక్సెస్ మీట్ వేదిక మీద ఉండటం మాకూ సంతోషాన్ని ఇస్తోంది. ఈ మూవీ టీమ్ కు నా అభినందనలు.”

“మీరు తర్వాత ఎన్ని విజయాలు సాధించినా, కెరీర్ ఎర్లీ డేస్ లో సాధించిన సక్సెస్ లే మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కిరణ్ ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తన కష్టంతో, ప్రతిభతో నిలదొక్కుకున్నాడు. ఇలాగే అతను మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. ఇక్కడ ఎవరూ ఎవరికి సపోర్ట్ చేయరు, గెస్ట్ లుగా రారు. మన సినిమానే, మన టాలెంటే మనల్ని కాపాడుతుంది” అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు నిర్మాత దిల్ రాజు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.