మట్కా పక్కా బ్లాక్ బాస్టర్ – జివి ప్రకాష్ కుమార్

Matka will definitely become a blockbuster says Music Director GV Prakash

ఎప్పటి నుండో సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్ వచ్చే వారం లో మట్కా తో రానున్నాడు.పలాస ఫేమ్ కరణ కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా రీసెంట్ గా రిలీజైన ట్రైలర్ ప్రామిసింగ్ గా అనిపించింది.ఈసినిమాలో వరుణ్ డిఫ్రెంట్ గెటప్ లలో కనిపించనున్నాడు.ప్రస్తుతం టీం ప్రమోషన్స్ తో బిజీగా వుంది.ఇక ఈసినిమా పక్కా బ్లాక్ బాస్టర్ అవుతుందని మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ అంటున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మట్కాకు మ్యూజిక్ చేయడం సవాలు కూడుకున్న పని.రీసెంట్ గా ఏ సినిమాకు ఇంతలా కష్టపడలేదు.వరుణ్ చాలా బాగా నటించారు.కరుణ కుమార్ చాలా బాగా తీశారు.మట్కా అద్భుతమైన నటన ,ఎమోషన్స్ ,యాక్షన్ తో కూడుకున్న ఇంటెన్స్ గ్యాంగ్ స్టర్ డ్రామా.ఈసినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుందని ఆయన అన్నారు.

ఇందులో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ నటి నోరా ఫతేహి కీలక పాత్రలో కనిపించనుంది.వైరా ఎంటర్టైన్మెంట్స్,ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించాయి.వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీ గా వస్తుంది మట్కా.నవంబర్ 14న రిలీజ్ కానుంది.అయితే అదే రోజు సూర్య కంగువా కూడా విడుదలకానుండడంతో మట్కాకు భారీ పోటీ ఎదురుకానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.