యంగ్ హీరో కిరణ్ అబ్బవరం క రెండో వారంలోకి ఎంట్రీ ఇచ్చి థియేటర్లలో స్ట్రాంగ్ హోల్డ్ తో రన్ అవుతుంది.ఇప్పటికే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి సూపర్ హిట్ అనిపించుకుంది.ఫుల్ రన్ లో 40 నుండి 50కోట్ల మధ్య వసూళ్లను రాబట్టుకోనుంది.ఇక క తో కిరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తెలుగు లో హిట్ కావడంతో మిగితా భాషల్లో కూడా రిలీజ్ కానుంది.అందులో భాగంగా మలయాళ,తమిళ ,హిందీ భాషల్లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.మలయాళం వెర్షన్ థియేట్రికల్ హక్కులు ప్రముఖ హీరో దుల్కర్ సల్మాన్ చెందిన వేఫెరర్ సంస్థ దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక క ఓటిటి రైట్స్ కూడా అమ్ముడయ్యాయి.ఈటీవీ విన్ ఈ హక్కులను ఫ్యాన్సీ రేట్ కు దక్కించుకుంది.ఇంతకుముందు కిరణ్ నటించిన సినిమాలు ఒక్క మీటర్ మినహా అన్ని ఆహాలో విడుదలయ్యాయి.కానీ ఈసారి మాత్రం ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.అయితే ఇప్పుడప్పుడే స్ట్రీమింగ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే లేదు.థియేటర్లలో సూపర్ గా రన్ అవుతుండడం అలాగే ఇతర భాషల్లో రిలీజ్ కానుండడంతో ఆలస్యంగానే స్ట్రీమింగ్ లోకి రానుంది.కుదిరితే వచ్చే నెల మొదటి వారంలో స్ట్రీమింగ్ లోకి తీసుకువచ్చే ఛాన్స్ ఉంది.
సుజీత్,సందీప్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా ఆయ్ ఫేమ్ నయన్ సారిక అలాగే తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు.సామ్ సీఎస్ సంగీతం అందించాడు.చింతా గోపాలకృష్ణ రెడ్డి ఈసినిమాను నిర్మించాడు.ఈసినిమాను వంశీ నందిపాటి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























