గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ‘హనుమాన్’ సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొన్నిరోజుల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. సాయి దుర్గ తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుండగా.. ఇటీవలే ఆమె బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుండి తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసి విషెస్ తెలిపింది చిత్ర బృందం. కాగా ఐశ్వర్య ఇందులో ‘వసంత’ అనే పాత్ర పోషిస్తోంది.
అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ “ఇంట్రూడ్ ఇన్‌టు ది వరల్డ్ ఆఫ్ ఆర్కాడీ” (Intrude into the world of Arcady)అనే పేరుతో స్పెషల్ మేకింగ్ వీడియోను విడుదల చేసిన విషయం గుర్తుండేవుంటుంది. దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో 1940 కాలంనాటి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ రోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇకఇదిలావుంటే, ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ యాక్టర్స్ జగపతిబాబు మరియు సాయి కుమార్ ఇద్దరూ SDT18లో నటిస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా మరో ప్రముఖ నటుడు ఈ చిత్రంలో భాగమయ్యారు. సీనియర్ నటుడు శ్రీకాంత్ మేకాను SDT18 బృందం బోర్డులోకి స్వాగతించింది. ఈ మూవీలో పవర్ హౌస్ పెర్ఫార్మర్ శ్రీకాంత్ క్రూషియల్ రోల్ పోషిస్తున్నారు. ఇంటెన్స్ లుక్‌లో ప్రెజంట్ చేసిన శ్రీకాంత్ ఇంట్రో పోస్టర్ క్యురియాసిటీ పెంచింది.
కాగా ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పార్ట్ ఎక్కువగా ఉండనుంది. దీంతో కంటెంట్ మీద వున్న నమ్మకంతో ఖర్చుకి ఎక్కడా వెనుకాడకుండా సినిమాను నిర్మిస్తున్నారు నిర్మాతలు. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ మరియు మలయాళం భాషల్లో పాన్ ఇండియా మూవీగా విడుదలకానున్న ఈ సినిమా సాయి దుర్గా తేజ్‌కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచిచూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: