మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్‌తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
అమరన్, లక్కీ భాస్కర్, ఇప్పుడు మట్కా.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు..ఎలా అనిపిస్తోంది?
- చాలా హ్యాపీగా వుంది. దీపావళికి వచ్చిన అమరన్, లక్కీ భాస్కర్ ఈ రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోవడం సంతోషంగా వుంది.
- మట్కా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని పూర్తి నమ్మకం వుంది.
- మట్కా డైరెక్టర్ కరుణ కుమార్ గారికి అద్భుతమైన స్క్రిప్ట్ నాలెడ్జ్ వుంది.
- ఆయనకి ఉన్న డార్క్ ఫిలిం మేకింగ్ స్టయిల్ బ్రిలియంట్.
- మట్కా చాలా మంచి స్క్రిప్ట్. నాకు చాలా నచ్చింది.
- మట్కా తప్పకుండా మరో బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది.
మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్‌కి ఇస్తారా?
- నా ఫస్ట్ ప్రిఫరెన్స్ స్క్రిప్ట్ కి ఉంటుంది. తర్వాత డైరెక్టర్ గురించి కూడా ఆలోచిస్తాను.
- తను ఇంతకుముందు ఎలాంటి సినిమాలు చేశారు?
- తన ఫిల్ మేకింగ్ స్టైల్ ఏమిటి, విజువల్‌గా కథని ఎలా తీస్తారనేది కూడా చూస్తాను.
- కరుణ్ కుమార్ గారు స్క్రిప్ట్ పరంగా, విజువల్‌గా, టెక్నికల్‌గా చాలా అద్భుతమైన డైరెక్టర్.
- చాలా హై బడ్జెట్‌తో ఈ సినిమా గ్రాండ్‌గా తీశారు.
- లక్కీ భాస్కర్, అమరన్ లానే ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది.
మట్కా పిరియాడికల్ స్టోరీ కదా.. మ్యూజిక్ కోసం ఎలాంటి కేర్ తీసుకున్నారు?
- ఇది పిరియాడికల్ స్టోరీ. మ్యూజిక్ కూడా పిరియాడికల్ గానే ఉండాలి.
- ఆడియన్స్‌ని ఆ టైమ్స్ లోకి తీసుకెళ్లాలి. ఈ విషయంలో మాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి.
- మోడరన్ సింథ్స్ వాడడం కుదరదు. పిరియాడిక్ టోన్‌ని క్రియేట్ చేయడానికి ఆ తరహా మ్యూజిక్‌ని సృష్టించాలి.
- ఆ టైమ్ పీరియడ్‌కి ఆడియన్స్‌ని మళ్లీ తీసుకురావాలంటే అలాంటి మ్యూజిక్‌ని ప్రొడ్యూస్ చేయాలి.
- అది నాకు బిగ్ ఛాలెంజ్ అనిపించింది. మట్కా గ్యాంగ్ స్టర్ ఫిలిం.
- వైలెన్స్, యాక్షన్, హై ఎమోషన్ వుంటుంది. ఇది గాడ్ ఫాదర్ తరహా సినిమా.
సినిమా చూసే వుంటారు కదా..ఎలా అనిపించింది?
- నేను సినిమా చూశాను. ఇది నైస్ యాక్షన్ ఫిల్మ్.
- అద్భుతమైన డైరెక్షన్, స్టొరీ, పెర్ఫార్మెన్స్‌లు ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి.
- వరుణ్ తేజ్ గారు ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు.
- అది స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇందులో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు.
- కచ్చితంగా సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ అవుతుంది.
డైరెక్టర్ కరుణ కుమార్ గురించి?
- కరుణ్ కుమార్ గారు చాలా అద్భుతమైన రైటర్.
- డార్క్ జోనర్ సినిమా చేయడంలో ఆయనదిట్ట. ఆయన సినిమాల్లో రా నెస్ ఉంటుంది. ఆయన కథలు నేచురల్‌గా వుంటాయి.
- ఈ సినిమాలో కరుణ్ కుమార్ గారితో కలిసి పని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.
- ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. బిగ్ బడ్జెట్‌తో ఈ సినిమాని నిర్మించారు.
యాక్టర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా బిజీగా ఉంటున్నారు.. టైంని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
- నెలలో 12 రోజులు షూట్ చేస్తాను. మిగతా రోజులన్నీ మ్యూజిక్ లోనే ఉంటాను.
- రెండు నెలల ముందే షెడ్యూల్ చేసుకుంటాను.
- అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాను. మ్యూజిక్ విషయంలో ఆన్ టైం ఉంటాను.
- నా వర్క్‌ని టైంకి డెలివర్ చేస్తాను, నేను ఎప్పుడూ లాస్ట్ మినిట్ వర్క్ చేయను.
- వారం రోజులు ముందుగానే అవుట్ ఫుట్ ఇచ్చేస్తాను.
- అందుకే నిర్మాతలు నాతో వర్క్ చేయడానికి హ్యాపీగా ఉంటారు.
- మ్యూజిక్ యాక్టింగ్ రెండిటిని సమానంగా ఆస్వాదిస్తాను. ఈ రెండిట్లోనూ లెర్నర్ గానే ఫీలవుతాను.
- ఎప్పుడూ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాను. ప్రతిరోజు ఒక విద్యార్థిగానే భావిస్తాను.
ఈ ఏడాది వందో సినిమా చేస్తున్నారు.. అయినప్పటికీ ఒక స్టూడెంట్ గానే ఫీలవుతున్నాను అని చెప్తున్నారు.. ఎలా?
- మ్యూజిక్ అనేది ఒక సముద్రం లాంటిది. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి.
- ప్రతి సినిమా మనకి ఏదో కొత్త విషయాన్ని నేర్పుతుంది. అందుకే ప్రతిరోజు నేర్చుకోవడానికి ఇష్టపడతాను.
మీ 100 సినిమాల జర్నీ గురించి చెప్పండి?
- నిజంగా ఇది గ్రేట్ జర్నీ. దేవుడి దయగా భావిస్తాను.
- యుగానికి ఒక్కడు, మద్రాస్ పట్నం, ఆకాశమే నీ హద్దురా, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా.. ఇలా ఎన్నో జోనర్స్‌లో సినిమాలు చేశాను.
- చాలా టైం లెస్ క్లాసిక్ సాంగ్స్ వచ్చాయి. ఈ జర్నీ చాలా ఆనందాన్ని ఇచ్చింది.
- ప్రతిసారి ఆడియన్స్‌ని అలరించడానికి నా వంతు కృషి చేస్తాను.
మట్కాలో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి?
- రెట్రో జోన్‌లో చేసిన లేలే రాజా సాంగ్ నాకు చాలా ఇష్టం.
- 80స్ బ్యాక్‌డ్రాప్‌లో బప్పిలహరి స్టైల్లో చేసిన సాంగ్ అది.
- ఆ సాంగ్ చేసినప్పుడు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించింది.
యాక్టర్‌గా తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తున్నారు?
- నిజానికి ‘దసరా’లో ఒక క్యారెక్టర్ నేను చేయాల్సింది. కానీ నా డేట్స్ కుదరలేదు.
- మంచి కథ, క్యారెక్టర్ వుంటే డెఫినెట్‌గా చేస్తాను.
మీకు ఇష్టమైన జానర్ ఏంటి?
- నాకు లవ్ స్టోరీస్ చేయడం ఇష్టం.
- మంచి పాటలు చేయడానికి ఆ జోనర్ చాలా బాగుంటుంది.
- సెల్వ రాఘవన్ గారితో ఒక లవ్ స్టోరీ చేస్తున్నాను.
మీ 100 సినిమా గురించి?
- సుధా కొంగర గారితో నా వందో సినిమా చేస్తున్నాను.
- సినిమా అనౌన్స్మెంట్ త్వరలోనే వస్తుంది.
ఆల్ ది బెస్ట్..
థాంక్ యూ.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























