గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు.మరో రెండు రోజుల్లో ఈ టీజర్ రానుంది.అయితే ఇప్పటికే టీజర్ ను చూసిన ఇండస్ట్రీ కు చెందినవారు ఓ రేంజ్ లో అంచనాలు పెంచేస్తున్నారు.టీజర్ వచ్చాక సినిమా పరిస్థితి మారుతుందని అదిరిపోయే రేంజ్ లో ఉందని ఇందులో శంకర్ ,రామ్ చరణ్ ను ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా కావడమని ఖాయమని అంటున్నారు.మొత్తానికి టీజర్ సినిమా రేంజ్ ను డిసైడ్ చేయనుంది.ఈనెల 9న లక్నో లో ఈవెంట్ ను నిర్వహించనున్నారు.ఇందులో టీజర్ ను వదలనున్నారు.ఈసినిమా తెలుగుతోపాటు తమిళ,హిందీ భాషల్లో విడుదలకానుంది.హిందీ జనాలకు కూడా కనెక్ట్ అయ్యే కంటెంట్ తో వస్తుంది గేమ్ ఛేంజర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.సినిమాను భారీ లెవెల్లో ప్రమోట్ చేయనున్నారు.సోషల్ మెసేజ్ తో శంకర్ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో కియరా అద్వానీ హిరోయిన్ గా నటిస్తుండగా శ్రీకాంత్ ,ఎస్ జె సూర్య ,సునీల్ ,కిక్ శ్యామ్ ,అంజలి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.థమన్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.సంక్రాంతి టార్గెట్ గా జనవరి 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఇక ఇదిలావుంటే రామ్ చరణ్ తన నెక్స్ట్ మూవీ ని సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు.ఈనెల 22నుండి మైసూర్ లో తన 16వ సినిమా మొదటి షెడ్యూల్ స్టార్ట్ కానుందట.బుచ్చి బాబు సనా ఈసినిమాను డైరెక్ట్ చేయనుండగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది.ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,వృద్ధి సినిమాస్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: