అమరన్ జోరు ఎక్కడ ఆగుతుందో తెలీదు

Hero Nithiin Praises Amaran Movie Unit on Block Buster Hit

ప్రిన్స్ శివకార్తికేయన్, సాయి పల్లవి బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు. నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా టీం ‘అమరన్’ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హీరో నితిన్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.

ఇక అమరన్ బ్రేవ్ హార్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ హీరో నితిన్ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. నితిన్ ఏమన్నారో ఆయన మాటల్లోనే చుద్దాం.. “అందరికీ నమస్కారం. ముందుగా ఆడియన్స్ అందరికీ థాంక్యూ. దీపావళికి మూడు సినిమాలు వచ్చాయి. ఈ మూడు సినిమాల్ని పెద్ద హిట్ చేశారు. థాంక్యూ ఆల్. తమిళ్ డబ్బింగ్ సినిమాలా కాకుండా స్ట్రైట్ తెలుగు సినిమాల చూసి అమరన్‌ని ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియన్స్ అందరికీ థాంక్యూ సో మచ్.”

“విక్రమ్, అమరన్ సినిమాల్లో మమ్మల్ని పార్ట్ చేసిన కమల్ హాసన్ గారికి, మహేంద్రన్ గారికి థాంక్యూ సో మచ్. అమరన్ సినిమా తీసుకున్నప్పుడు డాడీ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దానికి కారణం కమల్ హాసన్ గారు, రెండు సాయి పల్లవి. ఒక దేశభక్తి సినిమాలో లవ్, ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని బ్లెండ్ చేయడం అంత ఈజీ కాదు. డైరెక్టర్ రాజ్ కుమార్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీర్చిదిద్దారు. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్స్ రియల్లీ హార్ట్ టచింగ్. ఈ సినిమాతో డైరెక్టర్ గారికి ఫ్యాన్ గా మారిపోయాను.”

“సాయి పల్లవి గారి వర్క్ కి నేను గ్రేట్ ఫ్యాన్ ని. సాయి పల్లవి గారి డాన్స్ కి కూడా నేను పెద్ద అభిమానిని. సాయి పల్లవి గారితో ఒక సినిమాలో డాన్స్ చేయాలి. అది నాకు గ్రేట్ చాలెంజ్. ఆ రోజు తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. అమరన్ లో సాయి పల్లవి గారు నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చారు. శివ కార్తికేయన్, నేను గత నాలుగేళ్లుగా ఫోన్లో, మెసేజెస్ లో మాట్లాకుంటున్నాం. ఫైనల్ గా ఈరోజు ఈ సక్సెస్ మీట్ లో కలవడం చాలా ఆనందంగా ఉంది.”

“ఈ సినిమాలో శివ కార్తికేయన్ జీవించేసారు. చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ చూపించారు. ఆయన హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్. ఈ సినిమాతో శివ కార్తికేయన్ మా తెలుగు హీరో, తెలుగు అబ్బాయి అయిపోయారు. అమరన్ ఈ వీక్ తో లైఫ్ టైం కలెక్షన్స్ ఆఫ్ విక్రమ్ క్రాస్ చేస్తుంది. ఈ సినిమా ఎక్కడ ఆగుతుందో తెలీదు. ఎవ్రీ డే పిక్ అవుతుంది. అమరన్ టీమ్ అందరికీ థాంక్యు. ఈ అవకాశం ఇచ్చిన కమల్ హాసన్ గారికి థాంక్యూ. జైహింద్” అని అన్నారు హీరో నితిన్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.