గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చరణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సముద్రఖని, సునీల్, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా గేమ్ ఛేంజర్ సినిమాకు మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేయగా.. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే థర్డ్ సింగిల్ విడుదలకానుంది. మరోవైపు గేమ్ ఛేంజర్ టీజర్ ఈనెల 9న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి కీలక అప్‌డేట్ అందింది.
గేమ్ ఛేంజర్ టీమ్ ఉత్తరప్రదేశ్ లోని లక్నో వేదికగా ఈ టీజర్‌ను లాంచ్ చేయనుంది. దీనిలో భాగంగా ఆరోజు అక్కడ గ్రాండ్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నట్టు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్‌తో, రామ్ చరణ్ లక్నోలో మొట్టమొదటి గ్రాండ్ టీజర్ లాంచ్‌ను హోస్ట్ చేయడం ద్వారా గేమ్‌ను మారుస్తున్నారు. తద్వారా చరణ్ లక్నోకి టీజర్ లాంచ్‌ను తీసుకువచ్చిన మొదటి సూపర్‌స్టార్ అయ్యాడు.
గేమ్ ఛేంజర్ నార్త్ ఇండియా రిలీజ్ రైట్స్ ‘ఏఏ ఫిల్మ్స్ ఇండియా’ సంస్థ దక్కించుకుంది. ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత రామ్ చరణ్‌కి హిందీ బెల్ట్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. దీంతో గేమ్ ఛేంజర్ సినిమాపై అక్కడి ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో మేకర్స్ చరణ్ క్రేజ్‍ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. అందుకే అక్కడ భారీ రిలీజ్‍కి ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ మూవీకి కార్తీక్ సుబ్బరాజు కథనందించగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది. మరోవైపు చరణ్ ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో క్రీడాంశం నేపథ్యంలో ఆర్‌సీ16 చిత్రంలో నటిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























