ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2: ది రూల్’. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని భారతదేశ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ సుకుమార్ రైటింగ్స్ అసోసియేషన్‌తో కలిసి గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్‌తో పాటు ప్రమోషనల్ కంటెంట్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్ సహా రెండు పాటలు ఎంతటి సన్సేషన్స్ సాధించాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇటీవలే డిసెంబరు 5న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నేషనల్ ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు నిర్మాతలు.
దీంతో రోజు రోజుకు పుష్ప 2 చిత్రంపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ నేడు ఎక్స్ వేదికగా వెల్లడించారు. మూవీ రిలీజ్‌కు ఇంకో నెల రోజులే ఉండటంతో ఈరోజు స్పెషల్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది చిత్ర బృందం.
అల్లు అర్జున్, ఫహద్ ఫాజిల్ ఎదురెదురుగా నిల్చుని ఉన్న ఈ పిక్ మూవీపై అంచనాలను పెంచేస్తోంది. ఇక ఇదిలాఉంటే, మరోవైపు పుష్ప 2 చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆరు భాషల్లో కలిపి ఏకంగా 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 6500 స్క్రీన్స్‌లో, ఇంకా ఓవర్సీస్‌లో 5000 స్క్రీన్స్‌లో గ్రాండ్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.
దీంతో పుష్ప 2ను బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు మరే ఇండియన్ సినిమా కూడా ఇలాంటి ఘనత సాధించలేదని అంటున్నాయి ఇండియన్ ఫిల్మ్ సర్కిల్స్. ఇక పుష్ప 2 బాక్సాఫీస్ రూల్‌లో కలెక్షన్ల పరంగా బాక్సీఫీస్ వద్ద ఎన్నో సంచలనాలు కూడా సృష్టిస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: