తమిళ స్టార్ హీరో విజయ్ ,అట్లీ కాంబినేషన్ లో వచ్చిన తేరి 2016లో విడుదలై బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. తెలుగులో ఈసినిమా పోలీసోడు గా విడుదలై ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఇప్పుడు హిందీ లో రీమేక్ అవుతుంది. ఇందులో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తుండగా కీర్తి సురేష్, వామికా గబ్బి హీరోయిన్లుగా చేస్తున్నారు.ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ టీజర్ ను సూపర్ గా కట్ చేశారు.విజువల్స్ ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,వరుణ్ స్క్రీన్ ప్రెజెన్స్ టీజర్ లో హైలైట్ అయ్యాయి.టీజర్ అయితే సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది.ఈసినిమాతో వరుణ్ స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెట్టేలానే వున్నాడు.కలీస్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నాడు.
జియో స్టూడియోస్ నిర్మిస్తున్న ఈసినిమాకు అట్లీ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాడు.డిసెంబర్ 25న బేబీ జాన్ థియేటర్లలోకి రానుంది.మరి కోలీవుడ్ బ్లాక్ బాస్టర్ కు రీమేక్ గా వస్తున్న ఈసినిమా హిందీలో ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























