సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుందిSDT 18(వర్కింగ్ టైటిల్). షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది.రీసెంట్ గా ఓ భారీ యాక్షన్ షెడ్యూల్ కాగా కొద్దీ రోజుల క్రితం మరో షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇక ఈసినిమా కోసం ప్రముఖ నటుడు జగపతి బాబు ను తీసుకున్నారు.ఇందులో జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు.1947-67లో జరిగే కథతో తెరకెక్కుతున్న ఈసినిమాలో తేజ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు.త్వరలోనే టైటిల్ ను ప్రకటించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొత్త దర్శకుడు రోహిత్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా ఐశ్వర్య లక్ష్మి కథానాయికగా నటిస్తుంది.ఇందులో తను వసంత అనే పాత్రలో కనిపించనుంది.అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నాడు. కంటెంట్ మీద వున్న నమ్మకంతో ఖర్చు వెనుకాడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి,చైతన్య రెడ్డి. దాదాపు 100కోట్ల బడ్జెట్ పెడుతున్నారు.ఈసినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలకానుంది.వచ్చే ఏడాది వేసవి లో ప్రేక్షకులముందుకు తీసుకురవాలని చూస్తున్నారు.
ఇక గత ఏడాది విరూపాక్షతో కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు సాయి దుర్గా తేజ్.నిజానికి అయితే ఈసినిమా తరువాత ఈ హీరో గాంజా శంకర్ చేయాల్సివుంది.కానీ బడ్జెట్ కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది.దాంతో సాయి తేజ్ ,కొత్త దర్శకుడు రోహిత్ కు ఛాన్స్ ఇచ్చాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























