బెల్లంకొండ సాయి శ్రీనివాస్,మనోజ్ మంచు,నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్న సినిమా భైరవం.ఈరోజు టైటిల్ ను రివీల్ చేయడంతో పాటు సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశారు.ఇక ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాయి శ్రీనివాస్ రగ్గడ్ అండ్ రస్టిక్ గా కనిపించాడు.బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్న దేవాలయం,ప్రజలు కాగడాలు పట్టుకొని వుండటం పోస్టర్‌కు మరింత ఇంటెన్స్ ని యాడ్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
త్వరలోనే మంచు మనోజ్,నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ లు కూడా రానున్నాయి.శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కెకె రాధామోహన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతిలాల్ గడ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.సగానికిపైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈసినిమాను వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్ చేయాలన్న ప్లాన్ లో వున్నారు.
ఇక బెల్లంకొండ ప్రస్తుతం ఈసినిమాతోపాటు మరో సినిమాలు కూడా చేస్తున్నాడు.అందులో టైసన్ నాయుడు ఒకటి.భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ కె చంద్ర ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా 14రీల్స్ ప్లస్ నిర్మిస్తున్నారు.ఈసినిమాతో 11వ సినిమాను హారర్ జోనర్ లో అలాగే మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ లో తన 12వ సినిమా చేస్తున్నాడు. మరి హిట్ కోసం చాన్నాళ్ల నుండి ఎదురుచూస్తున్న సాయి శ్రీనివాస్ కు ఈ 4 సినిమాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తాయో.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























