టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం ‘క’ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ అంచనాలకు మించి రోజురోజుకీ వసూళ్లను పెంచుకుంటూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో తొలి రోజు కంటే రెండో రోజు ఎక్కువ వసూళ్లు అందుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేవిధంగా రెండో రోజు కంటే మూడోరోజు మరింత ఎక్కువగా, ఇక నాలుగో రోజు అంతకు మించి వసూళ్లను రాబట్టింది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. క చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజుల్లో మొత్తం 26.52 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని చేసి లాభాల బాట పట్టినట్టు అర్ధమవుతోంది.
ఇక ఈ వసూళ్లు చూస్తుంటే, మొత్తానికి ‘క’ తో కిరణ్ అబ్బవరం వరుస పరాజయాలకు బ్రేక్ పడినట్లయింది. ఫుల్ రన్ లో క 50 కోట్ల మార్క్‌ను చేరుకోవచ్చు అని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఈ సినిమా కిరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిపోతుంది. మరోవైపు సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో క టీమ్ ఫుల్ ఖుషీగా వుంది. ఈ నేపథ్యంలో ‘క 2’ కూడా ఉంటుందని కిరణ్ అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది.
దర్శకద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘ఆయ్’ ఫేమ్ నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించగా.. అచ్యుత్‌కుమార్, రెడిన్ కింగ్‌స్లే కీలక పాత్రలు పోషించారు. సామ్ సీఎస్ సంగీతం అందించిన ఈ సినిమాను చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించగా.. తెలుగులో వంశీ నందపాటి రిలీజ్ చేశాడు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























