అమరన్ టీంను ప్రశంసించిన రజినీకాంత్

Team Amaran praised by Super star rajinikanth

తమిళ హీరో శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతుంది.ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈసినిమాకు ప్రశంసలు కూడా దక్కుతున్నాయి.ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా వీక్షించిన రజనీకాంత్‌.. సినిమాని నిర్మించిన తన మిత్రుడు కమల్‌హాసన్‌కు ఫోన్‌ చేసి అభినందించారు. అద్భుతమైన చిత్రాన్ని నిర్మించారని మెచ్చుకున్నారు. అలాగే శివకార్తికేయన్, దర్శకుడు రాజ్‌కుమార్ , నిర్మాత ఆర్. మహేంద్రన్, సినిమాటోగ్రాఫర్ సాయి లని ప్రత్యేకంగా కలిసి అభినందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమా కథ, కథనం, యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా వున్నాయని టీమ్‌ అందరినీ ప్రశంసించారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్ . మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో కలిసి నిర్మించారు.

నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి, సిస్టర్ నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ ద్వారా గ్రాండ్ గా విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి ఘన విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.