రెబల్ స్టార్ ప్రభాస్-డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ తమిళనాడు లోని కరైకుడి లో స్టార్ట్ అయ్యింది.ప్రభాస్ లేకుండానే ఈ షెడ్యూల్ ప్రారంభం కాగా కొద్దీ రోజుల క్రితం ప్రభాస్ కూడా జాయిన్ అయ్యాడు.ఇక ఈరోజుతో మొదటి షెడ్యూల్ పూర్తి కానుంది.నవంబర్ చివర్లో సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది.త్వరలోనే ఈసినిమానుండి అప్డేట్ రానుంది.1940 బ్యాక్ డ్రాప్ లో హిస్టారికల్ ఫిక్షన్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుండగా మిథున్ చక్రవర్తి,జయప్రద కీలక పాత్రలు చేస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నాడు.భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్, టీ సిరీస్ నిర్మిస్తున్నాయి.వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రభాస్ కొంచెం బ్రేక్ తీసుకొని ది రాజాసాబ్ షూట్ లో పాల్గొననున్నాడు.వచ్చే నెల 6నుండి హైదరాబాద్ లో రాజా సాబ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ షెడ్యూల్ 90శాతం పూర్తి కానుంది.అదే నెల చివర్లో షూట్ కంప్లీట్ చేయనున్నారు.రీసెంట్ గా ఈ సినిమా నుండి ప్రభాస్ సెకండ్ లుక్ ను రిలీజ్ చేశారు. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో మారుతి ఈసినిమాను తెరకెక్కిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న విడుదలకానుంది.
ఇక ఈసినిమాలను పూర్తి చేసిన తరువాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ చేయనున్నాడు.వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్లనుంది.దీని తరువాత ప్రశాంత్ నీల్ తో సలార్ 2 ,నాగ్ అశ్విన్ తో కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























