మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న 75వ సినిమా టైటిల్ ,ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయడం తో మూవీ రిలీజ్ డేట్ కూడా చెప్పేశారు.అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరక్కుతున్న ఈసినిమాకు మాస్ జాతర అనే టైటిల్ ను ఖరారు చేశారు. మనదే ఇదంతా అనేది ట్యాగ్ లైన్. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా బాగుంది. ఇందులో రవితేజ చాలా యంగ్ గా హుషారు గా కనిపించాడు.ఇక రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు.వచ్చే ఏడాది మే 9న ఈసినిమా థియేటర్లలోకి రానుంది. రీసెంట్ గా రవితేజ తన కుడి చేతికి శస్త్ర చికిత్స చేయించుకొని బ్రేక్ తీసుకున్న రవితేజ రెండు రోజుల క్రితం తిరిగి ఈసినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మాస్ జాతర లో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.పవర్ ఫుల్ సబ్జెక్టు తో ఖాకి సినిమా తరహాలో తెరకెక్కుతుంది ఈసినిమా.సామజవరగమన ఫేమ్ భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.నాగవంశీ,సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
ఇక ఈ ఏడాది ఈగల్ ,మిస్టర్ బచ్చన్ లతో వచ్చాడు రవితేజ.కానీ ఈ రెండు సినిమాలు తనకు కావాల్సిన విజయాన్ని అందించలేకపోయాయి.దాంతో మాస్ జాతర విజయం రవితేజకు తప్పనిసరి కానుంది.ఈసినిమాపై రవితేజ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.మరి కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీ గా వస్తున్న మాస్ జాతరతో రవితేజ కమ్ బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























