నయనతార డాక్యుమెంటరీ.. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Netflix Announces Special Documentary on Lady Superstar Nayanthara

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార‌కు ఓ అరుదైన గౌరవం అందుకోనున్నారు. లేడీ సూప‌ర్ స్టార్‌గా పేరొందిన ఆమెపై ఒక స్పెషల్ డాక్యుమెంట‌రీ రూపొందింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ దీనిని నిర్మించడం విశేషం. న‌య‌న‌తార‌: బియాండ్ ద ఫెయిరీ టేల్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ డాక్యుమెంటరీ త్వరలోనే ప్రసారం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇందులో నయనతార తన చిత్రాలతో ఇండియన్ సినిమాపై చూపిన ప్రభావాన్ని తెలియజేస్తుంది. నెట్‌ఫ్లిక్స్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ డాక్యుమెటరీ నవంబర్ 18వ తేదీన న‌య‌న‌తార 40వ జన్మదినం సందర్భంగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు తాజాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.

కాగా ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన నయనతార, దాదాపు రెండు దశాబ్దాలుగా హీరోయిన్‌గా కొనసాగడం, ఈ క్రమంలో అత్యున్న‌త స్థాయి న‌టిగా ఎలా ఎదిగార‌న్న కోణంలో ఈ డాక్యుమెంట‌రీని రూపొందించినట్టు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. న‌య‌న‌కు సంబంధించి అభిమానులకు తెలియ‌ని ఎన్నో విష‌యాల‌ను దీనిలో చూపించ‌నున్నారు.

కూతురిగా, సోద‌రిగా, భాగ‌స్వామిగా, త‌ల్లిగా, స్నేహితురాలిగా ఎలా న‌య‌న‌తార త‌న జీవితంలో రాణించిందో ఆ డాక్యుమెంట‌రీలో చూపించ‌నున్నారు. కాగా చంద్ర‌ముఖి, గజిని, బిల్లా, లక్ష్మి, శ్రీరామరాజ్యం, సైరా నరసింహారెడ్డి, జ‌వాన్ వంటి అనేక బ్లాక్ బస్టర్ చిత్రాల్లో న‌య‌న‌తార న‌టించారు. ఇక 2022లో ఫిల్మ్‌మేక‌ర్ విశ్నేష్ శివ‌న్‌ను ఆమె పెళ్లి చేసుకోగా, ఈ దంపతులకు ఇద్దరు సంతానం.

కాగా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఇంతకుముందు ఇదేమాదిరి టాలీవుడ్ దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు ఎస్‌ఎస్ రాజ‌మౌళిపై కూడా ఓ ప్రత్యేక డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి గుర్తుండేవుంటుంది. మోడర్న్ మాస్టర్స్ సిరీస్​లో భాగంగా ‘మోడర్న్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి’ పేరుతో తెరకెక్కిన ఈ డాక్యుమెంటరీ ఆగస్టు 2నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.