మా విజయ్‌ మహా గట్టోడు, ఏం భయంలేదు

Director Trivikram Srinivas Interesting Comments on Vijay Devara Konda

మా విజయ్‌ మహా గట్టోడు, ఏం భయంలేదు అని స్టార్ హీరో విజయ్‌ దేవరకొండను ఉద్దేశించి అన్నారు మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ మేరకు ఆయన తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘లక్కీ భాస్కర్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ఈ తాజా తెలుగు చిత్రానికి ‘సార్’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించగా, మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఏర్పాటుచేసిన ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో త్రివిక్రమ్ శ్రీనివాస్ సహా విజయ్‌ దేవరకొండ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ విజయ్‌ని ప్రశంసల్లో ముంచెత్తారు. తనకు ఇష్టమైన హీరోల్లో విజయ్‌ ఒకరని తెలిపిన ఈ స్టార్ దర్శకుడు, అతడిని ఒక గొప్ప నటుడిగా అభివర్ణించారు.

డైరెక్టర్ త్రివిక్రమ్ ఏమన్నారంటే..? “ఈ తరం గొప్ప నటులు దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌ దేవరకొండ. వాళ్ళిద్దరినీ ఒకే వేదికపై చూడటం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు బాగా ఇష్టమైన నటుల్లో విజయ్‌ దేవరకొండ ఒకరు. సినిమాల్లోకి వచ్చాక ఎంతో ప్రేమను చూశాడు.. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూశాడు. ఆ రెండూ చాలా తక్కువ టైంలో చూడటమంటే.. చాలా గట్టోడు. దేవరకొండ బాలగంగాధర్‌ తిలక్‌ అమృతం కురిసిన రాత్రిలో ఒక కవిత రాశారు. ‘మా వాడే మహా గట్టివాడే’ అని రాశారు. అలాగే, మా విజయ్‌ కూడా మహా గట్టోడు, ఏం భయంలేదు” అని నవ్వులు పూయించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.